Krisha Pushkaralu
AP Govt.HELPLINE : 8333981170
Second day Holydips : 7,21,334 in Andhra Pradesh, 3,78,839 in Vijayawada ghats :Officials

LATEST PUSHKARAM NEWS (UPDATED EVERY FEW MINUTES)

UPDATED AT: 9:42:00 PM

Outstation Bus Stands in Vijayawada and City Bus numbers

పుష్కరాల సమయంలో విజయవాడకు నగరం వెలుపలి నుండి బస్సులు ప్రధాన బస్టాండ్ (PNBS) కు చేరవని అధికారులు తెలిపారు. మరి బస్సులు ఎక్కడికి వెళ్తాయంటే విజయవాడ చుట్టూ 6 శాటిలైట్ బస్టాండ్లను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లా కాకానిలో 1.
అవి ఏమిటో చూద్దాం…
1.) సిద్దార్ధ మెడికల్ కాలేజ్
2.) వై.వి రావు ఎస్టేట్.
3.) జాకీర్ హుస్సేన్ కాలేజ్(ఇబ్రహీం పట్నం)
4.) VTPS కాలేజ్ గ్రౌండ్స్(ఇబ్రహీం పట్నం)
5.) VR సిద్ధార్థ కాలేజ్(కానూరు)
6.) కాకాని (గుంటూరు)
ఇక్కడి నుండి యాత్రికులకు ప్రభుత్వం ఉచితంగా నడిపే లోకల్ బస్సులను అందుబాటులో ఉంచుతారు
*1) సిద్దార్ధ మెడికల్ కాలేజ్ — (శాటిలైట్ బస్ స్టాప్)*
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల నుండి వచ్చే బస్సులను ఈ బస్టాండ్లో (సిద్దార్ధ మెడికల్ కాలేజ్) నిలిపివేస్తారు. ఈ బస్సులలో యాత్రికులను ఘాట్లకు సమీపంలో ఉన్న పుష్కర నగరాలకు తరలిస్తారు. ఇక్కడి నుండి తిరుగు లోకల్ బస్సులు
_బస్సు నెంబర్ 1P_ : ఇది ప్రధాన బస్టాండ్ లోని పుష్కరనగర్ కు చేరుతుంది. అక్కడి సమీపంలో ఉన్న ఘాట్లలో యాత్రికులు తమ కార్యక్రమాలు ముగించుకొని తిరిగి ప్రధాన బస్టాండ్ (PNBS ) పుష్కర నగర్ కి చేరితే మరల 1P నెంబర్ గల బస్సు సిద్దార్ధ మెడికల్ కాలేజ్ కి చేరుస్తుంది..
_బస్సు నెంబర్ 1B_: ఈ బస్సు భవానిపురం లారీ స్టాండ్ లోని పుష్కర నగర్ కు చేరుస్తుంది.
_బస్సు నెంబర్ 1S_: ఇది ఇబ్రహీంపట్నంలోని పుష్కర నగర్ కు చేరుస్తుంది.
*2) వై.వి రావు ఎస్టేట్ — (శాటిలైట్ బస్ స్టాప్)*
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నూజివీడు, సత్తుపల్లి, ఏరియాల నుండి వచ్చు బస్సులను ఇక్కడ నిలిపివేస్తారు, ఇక్కడ నుండి తిరుగు లోకల్ బస్సులు
_బస్సు నెంబర్ 2P_: ఇది ప్రధాన బస్టాండ్ కు చేరుస్తుంది.
_బస్సు నెంబర్ 2B_: ఇది లారీ స్టాండ్ కు చేరుస్తుంది.
_బస్సు నెంబర్ 2S_: ఇది ఇబ్రహీం పట్నంకు చేరుస్తుంది.
*౩) జాకీర్ హుస్సేన్ కాలేజ్ (ఇబ్రహీం పట్నం)— (శాటిలైట్ బస్ స్టాప్)*
హైదరాబాద్ నుండి వచ్చే బస్సులను ఇక్కడ నిలిపివేస్తారు, ఇక్కడ తిరుగు లోకల్ బస్సులు
_బస్సు నెంబర్ 3B_: ఇది లారీ స్టాండ్ కు చేరుస్తుంది
_బస్సు నెంబర్ 2S_: పవిత్ర సంగమం కు చేరుస్తుంది.
*4) VTPS ‘A’ కాలనీ గ్రౌండ్స్ (ఇబ్రహీం పట్నం) — (శాటిలైట్ బస్ స్టాప్)*
తిరువూరు, భద్రాచలం, ఛత్తీస్ ఘడ్ , కొత్తగూడెం వైపు నుండి వచ్చే బస్సులను ఇక్కడ నిలిపివేస్తారు, ఇక్కడ తిరుగు లోకల్ బస్సులు
_బస్సు నెంబర్ 4S_: పవిత్ర సంగమం ఘాట్ కు చేరుస్తుంది.
*5) VR సిద్ధార్థ కాలేజ్ (కానూరు) — (శాటిలైట్ బస్ స్టాప్)*
ఉయ్యూరు, మచిలీపట్టణం, గుడివాడ, భీమవరం వైపు నుండి వచ్చే బస్సులను ఇక్కడ నిలుపుతారు, ఇక్కడి నుండి తిరుగు లోకల్ బస్సులు
_బస్సు నెంబర్ 5P_ : ఇది ప్రధాన బస్టాండ్ కు చేరుస్తుంది.
_బస్సు నెంబర్ 5B_ : ఇది భవానిపురం లారీ స్టాండ్ కు చేరుస్తుంది
*6) కాకాని (గుంటూరు) — (శాటిలైట్ బస్ స్టాప్)*
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూర్, అనంతపురం, తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల నుండి వచ్చు బస్సులను ఇక్కడ నిలుపుతారు.. ఇక్కడి నుండి తిరుగు బస్సుల సమాచారం ఇంకా అందలేదు.





0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.